Monday, December 23, 2024

మే 6న టిఎస్‌ఆర్‌జెసి సెట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలో 2023-24 సంవత్సరానికి జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు మే 6వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 35 గురుకుల కళాశాలల్లో ఎంపిసి,బైపిసి, ఎంఈసి కోర్సుల ప్రవేశాలకు మే 6వ తేదీన టిఎస్‌ఆర్‌జె సెట్ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షకు హాజరై విద్యార్థులు ఈ పరీక్షలకు అర్హులు.

కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31వ తేదీ చివరి తేదీ ఉండగా.. పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వినతి మేరకు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు తెలిపారు. విద్యార్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలను http://tsrjdc.cgg.gov.inలో చూడాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News