Wednesday, November 20, 2024

సంక్రాంతికి టిఎస్‌ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

TSRTC 4980 special buses for Sankranti

హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 8 నుంచి 14 వరకు టిఎస్‌ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపనుందని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 4980 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌ఎం స్పష్టపర్చారు. మహాత్మాగాంధీ, జూబ్లీహిల్స్, సిబిఎస్ బస్‌స్టేషన్లు, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కెపిహెచ్‌బి, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, టెలిఫోన్ భవన్, దిల్‌సుఖ్‌నగర్‌లతో పాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివపించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని వరప్రసాద్ వివరించారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఎపిలోని విజయవాడ, తెనాలి, విజయనగరం, గుంటూరు, గుడివాడ, కాకినాడ, రాజమండ్రి, రాజోలు, మచిలీపట్నం, పోలవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, తణుకు, భీమవరం, శ్రీకాకుళం, నర్సాపురం, భీమవరం, అనంతపురం, కర్నూల్, కడప, చిత్తూరు, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, కనిగిరి, ఉదయగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు కూడా సంక్రాంతి ప్రత్యేక బస్సులు నగరంలోని వివిధ పాయింట్ల నుంచి సిద్ధంగా ఉంటాయని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 3,380 బస్సులు, ఎపిలోని వివిధ ప్రాంతాలకు దాదాపు 1600 బస్సులు నడిపించనున్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్టా అదనపు బస్సుల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యంతో ఏర్పాటు చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News