నగరం నుంచి భద్రాచలానికి 70 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: శ్రీరామ నవవి పురస్కరించుకుని ఆర్‌టిసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, ఆదివారం భద్రాచలంలో జరగనున్న శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి 70 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు. అదే విధంగా ఖమ్మం నుంచి శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు సాధారణ సర్వీసులతో పాటు మరో 280 బస్సులతో కలపుకుని మొత్తం 350 బస్సులను నడుపుతున్నామన్నారు. రిజర్వేషన్ చేసుకోవాలనుకునే భక్తులు www.tsrtconline.in వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చన్నారు. భక్తులు అధికారులు కల్పిస్తున్న ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని సంస్థ అభివృద్దికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రతా నియమాలు పాటించని ప్రైవేట్ బస్సులు, వాహనాల్లో ప్రయాణిచండం మంచిది కాదని సుఖవంతమైన, ప్రయాణానికి ఆర్‌టిసి బస్సుల్లోనే ప్రయాణించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.