Monday, December 23, 2024

టిఎస్ ఆర్టీసి బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

TSRTC announced bumper offer for passengers

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికులను ఆకట్టుకునేలా టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ తాజాగా మరో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. 250 కిలోమీటర్లకు పైగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు వారి ఇంటి వద్ద నుంచి బోర్డింగ్ పాయింట్ వరకు ఆర్టీసి బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ట్విటర్ వేదికగా ఆయన వెల్లడించారు. జంట నగరాల్లో ప్రయాణానికి 2 గంటల ముందు, ప్రయాణం తర్వాత 2 గంటల సమయం వరకు ఈ అవకాశం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News