Friday, December 20, 2024

‘ఫ్యామిలీ-24 టికెట్’తో నగరవాసులకు బంపరాఫర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్టీసి చైర్మన్‌గా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్టీసిలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ప్రతి పండుగ లేదా కార్యక్రమం ఉన్న సందర్భంలో అనేక ఆఫర్లను ప్రవేశపెట్టి ప్రయాణికులకు మేలు చేస్తున్నారు. ఆర్టీసిని ఎలాగైనా లాభాల బాట పట్టించాలన్న ఆలోచనలతో ఎండి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే అనేక ఆఫర్లను తీసుకొచ్చిన ఆర్టీసి తాజాగా హైదరాబాద్ వాసులకు మరో బంపరాఫర్‌ను ప్రవేశపెట్టింది.

హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి తిరగడానికి ఆర్టీసి ఈ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.300లతో జంటనగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్) ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే అవకాశాన్ని కలిపించినట్టు అధికారులు తెలిపారు. ‘ఫ్యామిలీ -24 టికెట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌తో శని, ఆది వారాల్లో మాత్రమే ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. కుటుంబంలోని నలుగురు సిటీలోని ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆర్టీసి అధికారులు పేర్కొన్నారు. ఈ టికెట్లు ఆయా బస్సుల కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News