Monday, December 23, 2024

మహిళా ప్రయాణికులకు టిఎస్‌ఆర్టీసి విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. ఉచిత ప్రయాణం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరూ ఇష్టానుసారంగా బస్సుల్లో ఎక్కుతున్నారని, ఈ పథకంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీంతో మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.

”ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది” అని సజ్జనార్ వీడియోలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News