Monday, December 23, 2024

టిఎస్ ఆర్టీసి నష్టాల్లో ఉంది: ఎండి విసి సజ్జనార్

- Advertisement -
- Advertisement -

TSRTC Being in Loss says MD Sajjanar

మనతెలంగాణ/హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసిని లాభాల బాట పట్టిస్తామని టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్‌లో ప్లే స్కూల్‌ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం టిఎస్ ఆర్టీసి నష్టాల్లో ఉందన్నారు. గతేడాది రూ.2,200 కోట్ల నష్టం వచ్చిందని ఆయన తెలిపారు. నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టించేందుకు ఆర్టీసి యాజమాన్యం కృషి చేస్తోందన్నారు. కొవిడ్‌తో పాటు ఇంధన ధరలు పెరగడంతో ఆర్టీసి నష్టాల్లో ఉందన్నారు. కార్గో సర్వీసులను మెరుగుపరుస్తామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు, కొత్త బస్సులు, నూతన సంస్కరణల ద్వారా రానున్న రోజుల్లో ఆర్టీసిని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. ఇటీవల అమల్లో తీసుకొచ్చిన మ్యాంగో ఎక్స్‌ప్రెస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జనార్ పేర్కొన్నారు.

TSRTC Being in Loss says MD Sajjanar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News