Sunday, January 19, 2025

ఆర్ టిసి బస్సు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లో ఓ ఆర్ టిసి బస్సు బీభత్సం సృష్టించిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే స్థానికుల కథనం ప్రకారం..45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైదర్ షాకోట్ విలేజ్‌కు సమీపంలో సడెన్ గా కారు రావడంతో డ్రైవరు బ్రేక్ వేశాడు. దీంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి ఓ కరెంట్ స్థంభానికి తగిలి ఆగిపొయింది.

ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు అద్దాలు పగల గొట్టి మరీ ప్రయాణికులు బయటకు వచ్చారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. బస్సు డ్రైవరు కూడా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News