Friday, December 27, 2024

సూర్యాపేటలో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బుదవారం తెల్లవారుజామున ఖమ్మం నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో వెళ్తుండగా చివ్వేంల వద్ద బస్సు(ఇంద్ర ఏసి)లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను మరో బస్సులో పంపి బస్సును రిపేర్ కోసం సూర్యాపేట డిపోకు తరలిస్తుండగా సూర్యాపేట-ఖమ్మం రోడ్డు సమీపంలో బస్సులో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి.

అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాడు. దీంతో స్పందించిన ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. షాట్ సర్కుట్ కారణంగానే బస్సులో మంటలు సంభవించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News