Wednesday, January 22, 2025

కంటైనర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం నందిగామ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ తో పాటు ప్రయాణికులకు తీవ్రగాయాయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News