Tuesday, January 21, 2025

బైక్ ను ఢీకొన్న టిఎస్‌ఆర్‌టిసి బస్సు..

- Advertisement -
- Advertisement -

మునగాల : టిఎస్‌ఆర్టిసి రాజధాని బస్సు బైక్ ను ఢీకొట్టిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఇందిరానగర్ స్టేజీ సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకా వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. టిఎస్‌ఆర్టిసి రాజధాని బస్సు అతివేగంతో బైక్ ను ఢీకొట్టింది. బైక్ ను బస్సు సుమారు వంద మీటర్లు పైగా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లటంతో మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించాయి.

గమనించిన బస్సు డ్రైవర్ బస్సును పక్కకు ఆపి బస్సులో ఉన్న ప్రయాణికులందరూ బయటకు దిగారు. నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తి స్థాయిలో దగ్థమైంది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇందిరానగర్ గ్రామానికి చెందిన మురిగేష్ రాజు (45) సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News