Tuesday, January 21, 2025

డ్రైవర్ కు గుండెపోటు… పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్లలో ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు రేపల్లె నుంచి చీరాలకు వెళ్తుండగా కర్లపాలెం వద్ద డ్రైవర్‌కు బస్సు హార్ట్‌ఎటాక్ రావడంతో స్టీరింగ్‌పై పడిపోయాడు. బస్సు వేగం తగ్గడంతో పాటు బస్సు బురుదలో దిగబడడంతో ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు బస్సు నుంచి సురక్షితంగా బయటకు దిగారు. డ్రైవర్ సాంబశివరావును వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News