Sunday, December 22, 2024

ఖమ్మంలో విషాదం: రన్నింగ్‌ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు..

- Advertisement -
- Advertisement -

ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది.. అయినా నొప్పిని భర్తిస్తూ.. ప్రయాణికులను సురక్షితంగా కాపాడి.. ప్రాణాలు విడిచాడు బస్సు డ్రైవర్. ఈ విషాదం ఘటన గురువారం ఉదయం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. గుండెపోటుతో చనిపోయిన డ్రైవర్ ను ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన కాకాని శ్రీనివాసరావుగా గుర్తించారు.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి నుండి ఖమ్మం వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా శ్రీనివాసరావుకు గుండెనొప్పి వచ్చింది. దీంతో గుండెలో నొప్పిని భరిస్తూనే బస్సును కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి సమీపం మరకు తీసుకెళ్లి ఆపాడు. ఇది గుర్తించిన ప్రయాణికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే, కొద్దిసేపటికే చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాసరావు చనిపోయారు. గుండెపోటుతోనే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం కలిగించకుండా.. గుండెపోటుకు గురైనప్పటికీ బస్సును సురక్షింతంగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. గుండెపోటు వచ్చినా.. మమ్మల్నీ కాపాడాడని కొనియాడుతూ.. శ్రీనివాసరావు మృతిపట్ల ప్రయాణికులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News