Wednesday, January 22, 2025

శ్రీశైలం వద్ద టిఎస్ ఆర్ టిసి బస్సుకు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం: శ్రీశైలం వద్ద టిఎస్ ఆర్ టిసి బస్సుకు తృటి పెను ప్రమాదం తప్పింది.  శ్రీశైలం డ్యాం వద్ద శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న బస్సు గోడను ఢీకొట్టింది. టర్నింగ్ వద్ద బస్సు అదుపు తప్పి గోడను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

గోడకు ఉన్నఇనుప మేకులకు తట్టుకొని బస్స్ ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని కిందకు దిగారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి కారణం బస్సు బ్రేక్స్ పెయిల్ అయినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News