Sunday, December 22, 2024

లారీని ఢీకొట్టి ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసి బస్సు.. ఇల్లు ద్వంసం, లారీ డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం వైరా మండలంలోని పాలడుగులో ఓ ఆర్టీసి బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి, రోడ్డు ప్రక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇల్లు ధ్వంసమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని దావఖానాకు తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News