Sunday, January 19, 2025

వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: మిర్చి రైతు మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: వరంగల్ జిల్లాలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబండ తండాకూ చెందిన మిర్చి రైతు మృతిచెందాడు. తొర్రూరు శివారు రాయపర్తి మండలం మైలారం శివారులో ఆగిఉన్న టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. చివ్వెంల మండలం రోళ్లబండ తండా నుంచి ఈరోజు ఉదయం మిర్చి లోడుతో ముగ్గురు రైతులు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు టాటా ఏస్ వాహనంపై బయలుదేరారు.

టాటా ఏస్ టైర్ పంచర్ కావడంతో వాహనం రోడ్డుపై ఆగిపోయింది. ఈ క్రమంలోనే దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి టాటా ఏస్ ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ధారావత్ శ్రీను మృతి చెందగా, ధరవత్ భీమా, బానోత్ వెంకన్నలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News