షామీర్ పేట తిమ్మాయిపల్లి మీదుగా కీసరకు బస్సులు
ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు
మనతెలంగాణ, సిటీబ్యూరో: ఆర్‌టిసి ఆదాయానికి పెద్దఎత్తున నష్టం తీసుకు వస్తున్న ప్రైవేట్ వాహనాలపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శివారు ప్రాంతాల్లో బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా ఆయా మార్గాల్లో వెళ్ళే బస్సుల టిప్పులను కూడా పెంచి శివారు ప్రాంత ప్రజల రవాణా సమస్యలకు అధికారులు పరిష్కారం మార్గం చూపారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాలకు అదనపు బస్సులను నడపడమే కాకుండా ఆయా ప్రాంతాలకు వెళ్ళె బస్సుల ట్రిపులను సంఖ్యను కూడా పెంచారు. ఇంతకాలం కరోనా కారణంగా బస్సులకు దూరంగా ఉన్న ప్రయాణికులు కూడా క్రమంగా పెరుగుతున్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తి సంఖ్యలో తగ్గడమే కాకుండా ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్‌లో వాటి సంఖ్య రెండంకెలకు తగ్గడంతో ప్రభుత్వం కూడా గతంలో మాదిరిగా కాలేజీలు, పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడంతో …ఆయా కళాశాలలు,పాఠశాలల నిర్వాహకులు తిరిగి వాటిని ప్రారంభించారు. ప్రారంభంలో పాఠశాలలకు, కళాశాలలకు వచ్చే వారి సంఖ్య తగ్గినా. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకోవడం తదితర చర్యలతో క్రమంగా ఆయా కళాశాలలు, పాఠశాలలకు వెళ్ళె వారి సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా అధిక సంఖ్యలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలకు వెళ్ళె వారి సంఖ్య అధికం కావడమే కాకుండా , శివారు ప్రాంతాల నుంచి వివిధ కార్యాలకలాపలు, కార్యాలయలకు వెళ్ళే వారి సంఖ్య కూడా పెరిగింది.
అంతే కాకుండా ప్రయాణికులు సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం ద్వారా వచ్చే సమస్యలు అధికారులకు వివిధ కార్యక్రమాల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. ఒక వైపు పెట్రోల్ ధరలు రూ.105 దాటడం, ప్రయాణికులు కూడా తమ వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ఆర్‌టిసి బస్సులను ఆశ్రయిస్తుండంతో అధికారులు బస్సుల టిప్పులను పెంచడమే కాకుండా ట్రిప్పుల సంఖ్యను పెంచారు. అంతే కాకుండా షామీర్‌పేట నుంచి తిమ్మాయిపల్లి మీదుగా కీసరకు బస్సులను బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దిం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా మార్గాల్లో రూట్ సర్వే నిర్వహించి దానికి అనుగుణంగా బస్సులు తిప్పుతామంటున్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు ః శివారు ప్రాంతాల నుంచి నగర నడిబొడ్డు ప్రాంతాలకు బస్సుల సంఖ్యను పెంచడం పట్ల
తెలంగాణ పేద ప్రజల సంక్షేమ సంఘం నాయకులు ఆర్లసత్తిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ నుంచి 211యు సికింద్రాబాద్ నుంచి హీకీంపేట, తూమకుంటు, ఉప్పర్‌పల్లి,బాబాగూడ, బొమ్మరాశిపేట, పొన్నాల, ఉద్దమర్రి ,ఉషార్ పల్లి ప్రాంతాలకు వెళ్ళే బస్సులు సంఖ్య తక్కువగా ఉండటంతో తాము ఎన్నో రవాణా సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. ప్రస్తుతం అధికారులు ప్రతి 20 నిమిషాలకు బస్సులను ఏర్పాటు చేశారని దాంతో తమ రోజువారీ వ్యహరాలను చక్కదిద్దుగో కలుగుతున్నామంటున్నారు.