Wednesday, January 22, 2025

ఫోన్ చేస్తే ఇంటి దగ్గరికే ఆర్టీసి బస్సు

- Advertisement -
- Advertisement -

30 కంటే ఎక్కువమంది ఉంటే బస్సును బక్ చేసుకోవచ్చు
అవసరమైన వారు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేయండి
సాధారణ చార్జీల వసూలుతో ప్రయాణికుల తాకిడి పెరిగింది
ఆర్టీసి ఎండి సజ్జనార్

TSRTC to resume inter state bus Services

మనతెలంగాణ/హైదరాబాద్:  టిఎస్ ఆర్టీసి ఎండిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సజ్జనార్ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. ప్రయాణికులకు లాభం చేకూరేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టీసిని ప్రజల ముంగిట్లోకి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ చేస్తే ఇంటి దగ్గరికే ఆర్టీసి బస్సును పంపిస్తామని ఆర్టీసి ఎండి తెలిపారు. సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారి కోసం సజ్జనార్ ఈ సదుపాయాన్ని కల్పించారు. హైదరాబాద్‌లోని ఏదైనా ప్రాంతం నుంచి ఒకే ప్రాంతం వైపు వెళ్లాలనుకునేవారు 30 కంటే ఎక్కువమంది ఉంటే వారి ప్రాంతం దగ్గరికే బస్సును పంపిస్తామని సజ్జనార్ పేర్కొన్నారు. కాల్ సెంటర్ నెంబర్లకు ఫోన్ చేస్తే వారి ప్రాంతం దగ్గరికే బస్సులు పంపిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు కాల్ సెంటర్ నెంబర్లను ట్విట్టర్‌లో ఆయన షేర్ చేశారు.
అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం నాలుగు వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఎండి సజ్జనార్ తెలిపారు. సాధారణ చార్జీలు ఉండడంతో ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. రెండు రోజుల్లో 5 లక్షల మంది ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు. బస్టాండ్‌ల ఆవరణలో ఉన్న హోటళ్లు, స్టాల్స్‌లో వస్తువులు, తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బస్టాండ్లలో పార్కింగ్ చార్జీలు పెంచితే ఉపేక్షించమని సజ్జనార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News