Monday, December 23, 2024

ఆన్‌లైన్‌లో మామిడి పండ్ల సరఫరా…

- Advertisement -
- Advertisement -

TSRTC Cargo Delivery of Mango Express Pack

ఆర్టీసీ సిబ్బందితో చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్ : ఆర్టీసీ కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లో బంగినపల్లి మామిడి పండ్లను తీసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జగిత్యాల నుంచి ఆన్‌లైన్‌లో బంగినపల్లి మామిడి పండ్లను బుక్ చేసుకున్న చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు మ్యాంగో ఎక్స్‌ప్రెస్ ప్యాక్‌ను ఆర్టీసీ కార్గో డెలివరీ సిబ్బంది అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మ్యాంగో ఎక్స్‌ప్రెస్ ద్వారా ఇప్పటి వరకు 13వేల మందికిపైగా బుక్ చేసుకున్నారనితెలిపారు. www. tsrtcparcel.com వైబ్‌సైట్‌లో మామిడి పండ్లను బుక్ చేసుకొంటే నాలుగైదు రోజుల్లోనే డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. 5 కిలోల మామిడి పండ్లు రవాణా చార్జీలతో కలిపి రూ.581కే అందజేస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News