Wednesday, January 1, 2025

పెరిగిన టోల్‌ చార్జీలు ప్రయాణికుల నుంచే వసూలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇప్పటికే టోల్ ఛార్జీలను 5 శాతం పెంచి కేంద్రం భారం విధిస్తే ఆ భారాన్ని ఆర్టీసి నేరుగా ప్రజలపైనే మోపింది. ఆ డబ్బును నేరుగా ప్రయాణికుల నుంచే వసూలు చేస్తోంది. మినీ బస్సులు, లైట్ మోటార్ వాణిజ్య, సరకు రవాణా వాహనాలు, భారీ, అతిభారీ వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తానికి అదనంగా శనివారం నుంచి 5 శాతం టోల్‌ట్యాక్స్‌ను కేంద్రం పెంచగా, పెరిగిన ఈ టోల్ చార్జీల భారాన్ని ప్రయాణికులపై వేస్తూ ఆర్టీసి నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ధరలను సైతం నిర్ణయించింది.

ఆర్డీనరి నుంచి గరుడ ప్లస్ వరకు టోల్ ప్లాజా ఛార్జీలు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.4లు ఆర్డీనరి నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 వరకు పెంచినట్లు ఆర్టీసి యాజమాన్యం ప్రకటించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ.15, ఏసీ స్లీపర్ బస్సులో రూ.20 టోల్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. కొన్ని సిటీ ఆర్డినరీ బస్సులు టోల్ ప్లాజాల మీదుగా హైదరాబాద్ నుంచి సమీప ప్రాంతాలకు వెళ్లివస్తున్నాయి. వీటిపై కూడా రూ.4 పెంచినట్లు ఆర్టీసి తెలిపింది. పెరిగిన ఈ కొత్త ఛార్జీలు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి.
హాలీడే కార్డు ఛార్జీలను పెంచిన మెట్రో
సెలవు రోజుల్లో తిరగడానికి వీలుగా ఉన్న స్మార్ట్ కార్డు (సూపర్ సేవర్ హాలీడే కార్డు) ఛార్జీలను మెట్రో భారీగా పెంచింది. సెలవు రోజుల్లో ప్రయాణించే ఈ కార్డు రీఛార్జీ ధర మొదట్లో రూ.59లుగా ఉండేది. ఇప్పుడు దానిని రూ.99లకు పెంచారు. దీనికి తోడు మెట్రో స్మార్టు కార్డు ఉన్నవారికి ఇచ్చే డిస్కౌంట్ను రద్దీ వేళల్లో పూర్తిగా ఎత్తి వేశారు. స్మార్డు కార్డు తీసుకున్న వారికి 10 శాతం డిస్కౌంట్ ఉండేది ప్రస్తుతం అది లేదు. దీంతో రోజూ తిరిగే అనేక మంది ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News