Sunday, December 22, 2024

ఆర్‌టిసి దసరా లక్కీ డ్రాను సద్వినియోగం చేసుకోండి: ఆర్‌ఎం శ్రీధర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః బతుకమ్మ, దసరా పండగలను పురస్కరించుకుని టిఎఎస్‌ఆర్‌టిసి బుధవారం నుంచి ప్రవేశ పెట్టిన ఆర్‌టిసి దసరా లక్కీ డ్రాను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జోన్ రీజనల్ మేనేజర్ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ లక్కీ డ్రా బుధవారం నుంచి ఈ నెల 30 వరకు ఉంటుందని తెలిపారు. బస్సుల్లో ప్రయాణం పూర్తయిన అనంతరం తమ పేరు, ఫోన్‌లను టికెట్ వెనుక రాసి బస్టాండ్‌లలో ఏర్పాటు చేసిస ప్రత్యేక డ్రాప్ బాక్స్‌లలో వేయాలని ఆయన సూచించారు.

ప్రతి రీజియన్‌కు ఏడుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేసి మొత్తం 110మందికి ఒకొక్కకి రూ, 9,900 చొప్పున అందచేస్తామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్‌టిసిలో ప్రయాణం సురక్షితం, సుఖమయమని, బస్సుల్లో ప్రయాణించి సంస్థ ఆర్దికాభివృద్దికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News