Monday, December 23, 2024

టిఎస్ఆర్టీసీ ఖాళీ స్థలాల లీజుకు ఇ-టెండర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడానికి ఇ-టెండర్లను ఆహ్వానిస్తోంది. కాచిగూడ, మేడ్చల్, శామీర్‌పేట్, హకీంపేట్ వంటి ప్రధాన ప్రదేశాలలో భూములు అందుబాటులో ఉన్నందున, అద్దెకు అందుబాటులో ఉన్న భూములలో ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్‌లు/షోరూమ్‌లు, ఇన్-సిటీ వేర్‌హౌస్‌లు, లాజిస్టిక్‌లను ఏర్పాటు చేయాలనే ఆసక్తి ఉన్న వారినుంచి దరఖాస్తులను స్వాగతిస్తోంది.

కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్లో 2.83 ఎకరాలు, శామీర్పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు కలుపుకుని మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనునున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. టెండర్ ప్రక్రియ, దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం, ఆసక్తి గల వ్యక్తులు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్‌ని 9959224433లో సంప్రదించవచ్చని సూచించింది. టెండర్లను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 18, 2024. ఆసక్తి కలవారు ఆన్‌లైన్‌లో ఈ-టెండరు దరఖాస్తులను సమర్పించాలని సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News