Wednesday, January 22, 2025

గవర్నర్ పై కార్మికుల గరంగరం

- Advertisement -
- Advertisement -

మన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలు చేయనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని అడ్డుకునేలా ఉన్న బిజెపి వైఖరిపై మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అడ్డుపడితే స హించేది లేదని హెచ్చరిస్తున్నారు. గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

ఆర్టీసీ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయూ) ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలో ఉన్న 43,373 మంది కు టుంబాలలో కెసిఆర్ వెలుగులు నింపితే.. గవర్నర్ మాత్రం అంధకారం నింపేందుకు యత్నిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం సరికాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News