హైదరాబాద్: ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని, ఆర్‌టిసి సంస్థ యథాతథంగా కొనసాగుతుందని కెసిఆర్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆర్‌టిసి బిల్లుపై గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వం వివరణ పంపింది. కేంద్రవాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేని విషయమని, కార్పొరేషన్ కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బందులు లేవని వెల్లడించింది. ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని, ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే బిల్లు ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ప్రస్తుతం ఫించన్లు, తదితరాలకు సంబంధించి అయోమయం లేదని, ప్రభుత్వంలోకి తీసుకున్న తరువాత కార్మికులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని, వేతనాలు, భత్యం, కేడర్, పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండబోదని వివరించింది. గవర్నర్ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని, ఆర్‌టిసి బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని బిఆర్‌ఎస్ ప్రభుత్వం కోరింది.
Also Read: పక్కింటి అబ్బాయితో వివాహేతర సంబంధం… చెల్లి గొంతు కోసిన అన్న