హైదరాబాద్: ఆర్‌టిసి అధికారులు ప్రయాణికుల సౌకర్యం కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా అధికారులు సుమారు రెండు నెలల క్రితం ఆర్‌టిసిలో ప్రారంభించిన క్యూఆర్ కోడ్ విధానాన్ని ఆర్‌టిసి కార్గో సర్వీసులతో పాటు పార్సిల్ సర్వీసులు, ఎంజిబిఎస్ ,జేబిఎస్, రైతిఫిల్ బస్టేషన్‌లలోని ప్రధాన రిజర్వేషన్ కౌంటర్ల వద్ద మొదలు పెట్టారు. ప్రయాణికుల నుంచిమంచి స్పందన రావడంతో గ్రేటర్‌లోని బస్‌పాస్ కేంద్రాలు, ఇతర రిజర్వేషన్ కౌంటర్ల వద్ద అందుబాటులో తీసుకువచ్చారు. వీటి ద్వారా దూర ప్రాంత ప్రయాణికులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడమే కాకుండా విద్యార్థులకు, ఎన్జీవోలు కూడా ఉపయోగించుకునేందుకు రిజర్వేషన్ కౌంటర్లలో కూడా క్యూఆర్ కోడ్ సేవలను అందుబాటులో ఉంచారు.
క్యూఆర్ కోడ్ ఆధారి, యుపిఐ యూప్‌లద్వారా మోబైల్ ఫోన్‌లను ఉపయోగించి అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకునందుకు యుపిఐ ఆధారత సేవలను ఎంతోగానో ఉపయోగపడతాయంటున్నారు. ఈ క్యూఆర్ కోడ్ సేవలను క్రమంగా బస్సుల్లో టికెట్ తీసుకునేవారికి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత కోవిడ్ సమయంలో ఇటువంటి సేవలు అన్ని విధాలుగా ఉపయోగపడతాయనే అభియం కూడా వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఆన్‌లైన్ ట్రాన్స్‌క్షన్ చేయడం ద్వారా ఇటు సంస్థకు, అటు ప్రయాణికులకు కూడా ఖర్చుతో పాటు సమయం కూడా ఆదాఅవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ బస్‌పాస్ కేంద్రాలు వివరాలు ఈ క్రింది విధంగాఉన్నాయి
ఆబిడ్స్, అఫ్జల్ గంజ్, ఆరాంఘర్, బాలానగర్, సిబిఎస్, చార్మినార్,దిల్‌షుక్‌నగర్, ఈసీఐఎల్, ఫరూక్‌నగర్, ఘటకేసర్, జిహెచ్‌హెంసి, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, జేబిఎస్, కాచిగూడ, కూకట్‌పల్లి, ఎల్‌బినగర్,లింగంపల్లి,లోతుకుంట, మేడ్చెల్, మెహదీపట్నం,మిధాని,మోయినాబాద్, ఎన్జీవోస్, పటాన్‌చెరు, రైతిఫిలళ్ ఆర్‌జి ఎయిర్ పోర్టు, రిసాలాబజార్, ఎస్సార్‌నగర్, సనత్‌నగర్, శంషాబాద్, షాపూర్‌నగర్, తార్నాక, తుక్కుగూడ, ఉప్పల్ ఎక్స్‌రోడ్స్, ఉప్పల్, వనస్థలిపురం, ఉమెన్స్ కాలేజ్.