హైదరాబాద్ ః దసరా పండగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. కేవలం 11 రోజుల్లో దాదాపు రూ. 25 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. దసరా పండగను పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ఏపి, కర్నాటక రాష్ట్రాలకు టిఎస్ ఆర్టీసికి 5500 ప్రత్యేక బస్సులు నడిపింది. గత సంవత్సరంలో పొలిస్తే ఈ ఏడాది 1302 ప్రత్యేక బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజీబిఎస్, జెబిఎస్‌తో పాటు నగరంలోని అన్ని పికప్ పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. అయితే పండుగ సందర్బంగా అదనపు వసూలు చేయకుండా ఈసారి కూడా టిఎస్ ఆర్టీసీ సాధారణ చార్జీలనే వసూలు అయితే ఈసారి టీఎస్ ఆర్టీసీ కూడా డైనమిక్ చార్జీలను అందుబాటులోకి తెచ్చింది.
విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నె వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా డైనమిక్ ఫేర్నే వినియోగిస్తున్నారు. ప్రైవేట్ వాహానాలతో పోలిస్తే డైనమిక్ ఛార్జీలు తక్కువగా ఉండటంతో ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఇష్టపడ్డారు. సాధారణ రోజుల్లో తెలంగాణ ఆర్టీసీకి సుమారు రూ. 12 నుంచి రూ. 13 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే దసరా సందర్భంగా అదనంగా రోజుకు రూ. 2 నుంచి రూ. 3 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా ఒక రోజులో రూ. 19 కోట్ల వరకు ఆదాయ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.