Wednesday, January 22, 2025

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసి గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసి గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిని దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని ఎసి బస్సులను ఆర్టీసి నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లో జేబిఎస్ నుంచి రూ.524, బిహెచ్‌ఈఎల్ నుంచి రూ.564 టికెట్ ధరను నిర్ణయించింది. ఆధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఎసి బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించింది. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ సూచిస్తోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆర్టీసి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News