Friday, November 22, 2024

మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భవనాన్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసి

- Advertisement -
- Advertisement -

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) యాజమాన్యం రద్దు చేసుకుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్‌స్టేషన్ సమీపంలోని ఆర్టీసి స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం ఆ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆర్టీసికి చెందిన 7,059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(బిఓటీ) కింద 01.06.2013న లీజుకు తీసుకుంది.

వారి నుంచి 2017లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి టేక్ ఓవర్ చేసుకొని షాపింగ్ మాల్‌కు జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీపెక్స్‌గా పేరుపెట్టారు. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసి కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆర్టీసికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలిచ్చి నెల రోజుల గడువు పూర్తయిన మొత్తం బకాయిలను విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ చెల్లించలేదు. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దెకు సంబంధించి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి భవనాన్ని టిఎస్ ఆర్టీసి స్వాధీనం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News