Monday, December 23, 2024

ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి మరో శుభవార్త

- Advertisement -
- Advertisement -

ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు హైదరాబాద్- టు విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారి కోసం ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో తీసుకొచ్చినట్లుగా టిఎస్ ఆర్టీసి వెల్లడించింది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా హైదరాబాద్- టు విజయవాడ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అదేవిధంగా బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం డిస్కౌంట్‌ను సంస్థ కల్పించింది.

ఆ రాయితీ రిటర్న్ జర్నీకి కూడా వర్తిస్తుందని ఆర్టీసి అధికారులు తెలిపారు. టిఎస్ ఆర్టీసి బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ http://tsrtconline.in ను సంప్రదించాలని ఆర్టీసి ఎండి సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్ట్ షేర్ చేశారు. అందులో లహరి ఎసి స్లీపర్ 2, నాన్ ఎసి స్లీపర్ కమ్ సీటర్ 2, గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News