Thursday, January 23, 2025

ఆర్టీసి కళా భవన్ సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:హైదరాబాద్‌లోని ఆర్టీసి కళా భవన్‌ను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన అద్దె కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ సంస్థ 2016లో టిఎస్ ఆర్టీసికి చెందిన ఆర్టీసి కళాభవన్‌ను అద్దెకు తీసుకుంది. ఆ భవన్‌లో కల్యాణమండపం, కళా భవన్, మరో మూడు మినిహాళ్లు లీజుకు తీసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం నెలకు రూ.25.16 లక్షలను టిఎస్ ఆర్టీసికి సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్ ప్రైవేటు లిమిటెడ్ చెల్లించాల్సి ఉంది. కానీ, కొంతకాలంగా సుచిరిండియా సంస్థ అద్దె సకాలంలో చెల్లించక పోవడంతో రూ.6.55 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

పెండింగ్ బకాయిలను చెల్లించాలని టిఎస్ ఆర్టీసి అధికారులు పలుమార్లు సుచిరిండియాకు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ వారి నుంచి స్పందన రాలేదు. ఒప్పందం ప్రకారం ప్రతి నెలా అద్దె చెల్లించకుంటే నోటీసులు జారీ చేసి ఆర్టీసి కళాభవన్‌ను ఆర్టీసి అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. నోటీసులకు సుచిరిండియా సంస్థ స్పందించకపోవడంతో కళాభవన్‌ను టిఎస్ ఆర్టీసి అధికారులు తాజాగా సీజ్ చేశారు. సుచిరిండియా కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. సుచిరిండియా సంస్థ ఒప్పందం ప్రకారం ఆర్టీసికి అద్దె చెల్లించడం లేదు. కాంట్రాక్టును రద్దు చేసి ఆర్టీసి కళా భవన్‌ను సీజ్ చేస్తున్నామని ఆర్టీసి కళాభవన్ ఎంట్రన్స్‌లో ఒక పత్రాన్ని ఆర్టీసి అధికారులు అతికించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News