Monday, December 23, 2024

బంగినపల్లి మామిడి పళ్లు మీ ఇంటి వద్దకే…

- Advertisement -
- Advertisement -

TSRTC launches Mango Express services

మ్యాంగో ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించిన టిఎస్ ఆర్టీసి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు, వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది. అందులో భాగంగా వినూత్న ప్రణాళికలతో ముందుకెళుతూ ప్రజల ఆదరణను చూరగొంటోంది. భక్తుల మేడారం మొక్కు బంగారంను అమ్మవారికి సమర్పించి, ప్రసాదాన్ని అందించడంతో పాటు భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ కోటి గోటి తలంబ్రాలను భక్తులకు చేరవేసిన ఆర్టీసి, కార్గో, పార్శిల్ సేవల విభాగం ప్రస్తుతం మరో సరికొత్త సేవకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మామిడి పళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఎలాంటి వ్యయ, ప్రయాసాలు లేకుండా తక్కువ ధరతో వినియోగదారులకు వాటిని ఇంటిముందే అందించే ఏర్పాట్లను పూర్తి చేసింది. సహజ సిద్ధంగా పండించే జగిత్యాల బంగినపల్లి మామిడి పళ్లను డోర్ డెలివరీ ద్వారా అందించే వినూత్న సేవా కార్యాచరణకు టిఎస్ ఆర్టీసి శ్రీకారం చుట్టింది.

కార్గో, పార్శల్ సేవలు వినియోగించుకోవాలి: ఆర్టీసి చైర్మన్, వైస్ చైర్మన్‌లు

మామిడి పండ్లను ఎవరికైనా పంపించాలనుకుంటే టిఎస్ ఆర్టీసి కార్గో, పార్శల్ సేవలు వినియోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు. రుచి, శుచి, నాణ్యతకు మారుపేరైనా బంగినపల్లి మామిడి పళ్లను రాష్ట్ర ప్రజలకు అందించే ఉద్ధేశ్యంతో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే వైస్ చైర్మన్ అండ్ ఎండి విసి సజ్జనార్, ఐపిఎస్‌లు వెల్లడించారు. ఈ సేవలను పొందానులకునే వారు http://www.tsrtcparcel.in వెబ్ సైట్ ద్వారా 5, 10,15 కేజీలతో పాటు టన్ను నుంచి 10 టన్నుల వరకు బల్క్ బుకింగ్ కూడా చేసుకోవచ్చని వారు తెలిపారు. బంగినపల్లి మామిడి కేజీ రూ.115ల – చొప్పున బుక్ చేసిన వారం రోజుల్లోనే డోర్ డెలివరీ సేవల ద్వారా వినియోగదారుల ఇంటి చేరుస్తామని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు టిఎస్ ఆర్టీసి కాల్ సెంటర్ నెంబర్ 040- 23450033 , 040-69440000లో సంప్రదించవచ్చని వారు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News