Monday, December 23, 2024

టిఎస్ ఆర్టీసి కొత్త వెబ్‌సైట్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

TSRTC launches new website For Passengers

సంస్థ అభివృద్ధికి విలువైన అభిప్రాయాలను,
సూచనలను ప్రయాణికులు పంపాలి
ఆర్టీసి చైర్మన్, ఎండిల విజ్ఞప్తి

హైదరాబాద్: బస్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టిఎస్ ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యే, ఆర్టీసి ఎండి వి.సి.సజ్జనార్, ఐపిఎస్‌లు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడంతో పాటు ఆ సంస్థ కొత్త వెబ్‌సైట్‌ను (tsrtc.telangana.gov.in) ప్రారంభించారు. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ అని, సామాన్య ప్రజలు దీనిని సులభంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. పాత వెబ్‌సైట్‌ను పూర్తిగా మార్చి తాజా సమాచారంతో నవీకరించి పునరుద్ధరించినట్టు ఆయన తెలిపారు. ఈ పునరుద్ధరించబడిన వెబ్‌సైట్‌ను సందర్శించి, సంస్థ అభివృద్ధికి తమ విలువైన అభిప్రాయాలను, సూచనలను పంపాలని ప్రయాణికులకు చైర్మన్, ఎండిలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ అండ్ సంస్థ కార్యదర్శి ఏ. పురుషోత్తం, ఇతర ఉన్నతాధికారులు అన్ని కోవిడ్ నిబంధనలను అనుసరించి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News