Tuesday, April 15, 2025

యాజమాన్యం వాటికి జవాబు చెప్పాలి: ఆర్‌టిసి జెఎసి డిమాండ్

- Advertisement -
- Advertisement -

ఆర్‌టిసి ఉద్యోగులను తప్పుదోవ పట్టించిన యాజమాన్యం
వీటికి యాజమాన్యం జవాబు చెప్పాలి : ఆర్‌టిసి జెఎసి డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్‌టిసి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పేరుతో విడుదల చేసిన ప్రకటన కేవలం ఎండి పర్సనల్ ఆఫీసర్ ఇచ్చినట్టుగా ఉంది తప్ప కార్మికుల కష్టసుఖాలు తెలిసిన కార్పొరేషన్ అధికారి ఇచ్చినట్టు లేదని ఆర్‌టిసి జెఎసి పేర్కొంది. గత మూడు సంవత్సరాలుగా అనేక మార్లు ఎండి చెప్పిన విషయాలే తప్ప ఆ ప్రకటనలో యూనియన్ నాయకులు డిమాండ్‌లకు వివరణ ఇవ్వలేకపోయారని జెఎసి నేతలు పేర్కొన్నారు. యూనియన్ ల పేరుచెప్పుకొని కొంతమంది నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని బట్టి ఖచ్చితంగా ఇది ఎండి ప్రోద్బలంతో సమ్మెకు సిద్ధమవుతున్న కార్మికులను మభ్యపెట్టడానికి పక్కదారి పట్టించాడానికి ఇచ్చిన ప్రకటనే అని స్పష్టంగా అర్థం అవుతోందని వారన్నారు.

యూనియన్ లు సమ్మె నోటీసు ఇచ్చి దాదాపు మూడునెలలు కావస్తున్నా చలనం లేని యాజమాన్యం ఈరోజు ఇలా పసలేని ప్రకటన ఇచ్చేబదులు సమ్మె నోటీసు అంశాలను యూనియన్లతో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నింవచారు. నిజంగా యాజమాన్యం కాని, ఎండి కాని ఈ ప్రకటన జారీ చేసే ముందు అసలు కార్మిక సంఘాలు సమ్మె నోటీసు లో పెట్టిన డిమాండ్ల లలో ఏ ఒక్కదానికైనా వివరణ ఇచ్చామా లేదా? అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
వివరణ ఇవ్వలేని ముఖ్యమైన కార్మిక సమస్యలు

40 వేల పైచిలుకు కార్మికులు పనిచేస్తున్న ఆర్‌టిసిలో ట్రేడ్ యూనియన్ లను గుర్తించకపోవడం కార్మిక చట్టాలకు విరుద్ధమని తెలియదా? యూనియన్ ల పేరు చెప్పుకొని నాయకులు మోసం చెయ్యడం కాదు వెల్ఫేర్ బోర్డు ల పేరుచెప్పి గత మూడు సంవత్సరాల నుండి కార్మికులను మోసం చేస్తున్నది ఎవరో కార్మిక లోకానికి బాగా తెలుసని వారన్నారు. ప్రభుత్వాలు అంగీకరించినా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఆర్‌టిసిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకుండా, యూనియన్ ల పునరుద్ధరణ జరగక పోవడం వెనుక ఎవరున్నారో ప్రతి ఒక్కరికి తెలుసని వారన్నారు. 8 గంటల డ్యూటీలను 14 నుండి 16 గంటలకు పెంచి కార్మికులను బానిసలకన్నా హీనంగాచూస్తు వారిచే వెట్టి చాకిరీ చేయిస్తూ కార్మికుల వెన్ను విరిచేస్తున్న విషయం ఎందుకు ప్రస్థావించలేకపోయారని ప్రశ్నించారు.

గత మూడేండ్ల నుండి 3 వేల బస్ లు సంస్థ సమాకుర్చుకుందని చెప్పారని అవి అద్దె బస్సులా లేక ఆర్‌టిసి బస్సులా చెప్పలేదన్నారు. పర్యావరణ రహిత ఎలక్ట్రిక్ బస్సులు యూనియన్ నాయకులు వ్యతిరేకిస్తున్నారా? వాటివల్ల సంస్థకు, కార్మికులకు ఎలాంటి నష్టం లేదా?. యూనియన్ నాయకులు చేస్తున్నది దుష్ప్రచారమా?. మరి అదే నిజమైతే డిపోలకు డిపోలు ఎందుకు ఖాళీ చేయిస్తున్నారు, ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆర్‌టిసిలో 50 శాతానికి మించి హైర్ బస్సులు నడుస్తున్నాయని, ఇక ఈ ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్‌టిసి కుదేలు అవడం కాక మిగిలింది ఏముందపి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News