Monday, December 23, 2024

సిటీలో ఆర్టీసి కొత్త ఆఫర్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిటీలో ప్రయాణించే వారికి ఆర్టీసి భలే ఆఫర్ ఇవ్వనుంది. మహిళలు, సీనియర్ సిటిజన్లు, ఫ్యామిలీకి కొత్త తరహా టికెట్లు తేబోతోంది. ఇప్పటికే రోజంతా తిరిగేందుకు వీలుగా టి24 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులను ఆకర్షించేందుకు వీలుగా మహిళలకు, సీనియర్ సిటిజన్ల కోసం టి6, ఫ్యామిలీకి టి24 పేరుతో సిటీ బస్సులో ఆఫర్‌లు అందించనుంది. ఈ విషయాన్ని ఎండి విసి. సజ్జనార్ తెలిపారు.

ప్రత్యేక ఆఫర్ టికెట్‌లకు సంబంధించిన ప్రచార పోస్టర్‌లను అధికారులతో కలిసి బస్ భవన్‌లో ఆవిష్కరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళలు, సీనియర్ సిటిజన్లు(60 ఏళ్ల పైబడినవారు) రూ. 50 చెల్లించి టి6 టికెట్‌ను తీసుకుని గ్రేటర్ పరిధిలో ఆర్డినరీ, మెట్రో బస్సులో ప్రయాణించొచ్చు. అయితే టికెట్ తీసుకునేందుకు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇక వీక్ ఆఫ్ దినాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రయాణించేందుకు వీలుగా రూ. 300తో ఫ్యామిలీ(నలుగురు) టి24 టికెట్ తీసుకొని ప్రయాణించొచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News