Sunday, December 22, 2024

సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్న ఆర్టిసి అధికారులు

- Advertisement -
- Advertisement -

TSRTC officials preparing summer action plan

ప్రతి బస్‌డిపోలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్దం
బస్ టాప్‌పై పత్యేక ఏర్పాట్లు
షార్క్ సర్కూట్ కాకుండా చర్యలు

హైదరాబాద్: నగరంలో ప్రతి రోజు పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వాతవరణ శాఖ అధికారులు సైతం ఈ వేసివిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ప్రకటించడంతో ఆర్టిసి అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టిసి అధికారులు వేసివిలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్న 29 డిపోల్లో డ్రైవర్ల,కండక్టర్లకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందించడమే కాకుండి డిపోలో పని చేసే సిబ్బందికి మజ్జిగా ప్యాకెట్లను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వడదెబ్బ తగిలినప్పడు చేయాల్సిన ప్రాథమిక చికిత్సపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

సాధారణంగా ప్రతి వేసవిలో  మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దాంతో ఆర్టిసిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు హడలెత్తి పోతుంటారు. దీంతో మధ్యాహ్న సమయంలో ప్రయాణికుల తగ్గుడంతో ఆక్యుపెన్నీ రేషియే కూడా పడి పోయి తద్వారా సంస్థకు నష్టం వాటిల్లుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. బస్సుల్లోకి వేడిగాలులు రాకుండా కిటికీల అద్దాలను, వాటి డోర్లను మరమ్మత్తులు చేస్తున్నారు. బస్సు పైగా బాగంలో టార్బ్‌ను మరింత మందంగా వేయడమే కాకుండా దానిపై తెల్లని రంగులు వేసి బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై ఉష్ణోగ్రతల ప్రభావం పడకుండా చూస్తున్నారు.

ఉష్ణోగ్రతల ప్రభావం కేవలం ప్రయాణికుల మీద పడుతుందనుకుంటే పొరపాటే. అధిక ఉష్గ్రోతల కారణంగా రేడియేటర్ సాధారణ రోజుల్లో కంటే త్వరగా వేడెక్కుతుంది. దాంతో నడి రోడ్లు మీదనే బస్సులు ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బండి పడుతున్నారు. ఈ నే పథ్యంలో ఆర్టిసి అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు.ఎక్కువ సమయంలో సిగ్నల్స్ ,చౌరస్తాల వద్ద బస్సులు నిలపాల్సి వస్తే వెంటనే ఇంజన్ ఆఫ్ చేయాలని తద్వారా ఇంజన్ వెడెక్కకుండా ఉండటమే కాకుండా ఇంధనం కూడా పెద్ద ఎత్తున సేవ్ అవుతుందని చెబుతున్నారు. అంతే కాకండా బస్సులను సాధ్యమైనంత వరకు నీడ ఉన్న ప్రాంతాల్లోనే ఆపేందుకు కృషి చేయాలని చెబుతున్నారు.

క్షుణ్ణంగా కేబుల్ప్ తనిఖీ

గతంలో షార్ట్ సర్యూట్ కారణంగా రాణిగంజ్‌కు డిపోకు చెందిన ఒక బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన కూడా వేసివి కాలంలోనే జరగడంతో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాటరీ నుంచి ఇంజన్‌కు అనుసంధానం ఉన్న కేబుల్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బస్సుకు సంబంధించిన వైరింగ్ కిట్‌లో ఎటువంటి అతుకులు లేకుండా చూస్తున్నారు. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా కేబుల్‌స మీద ఉన్న టేపులు త్వరగా కరిగి పోవడం లేదా పక్కకు జరిగిపోవడం జరుగుతుంటుంది. అటువంటి వాటిపై అధికారులు దృష్టి సారించి కేబుల్స్ కారణంగా ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News