Wednesday, April 2, 2025

ఆర్‌టిసి కురు వృద్దుడు టిఎల్ నరసింహ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్‌టిసి కురు వృద్ధుడు టిఎల్ నరసింహా ఇకలేరు. హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్‌లోని తన నివాసంలో గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. 98 ఏళ్ల కురువృద్ధుడు నరసింహా మృతికి టిఎస్ ఆర్‌టిసి విసి ఎండి సజ్జనార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థతో ఆయనకున్న అనుభవాలను పంచుకున్నారు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా నరసింహను టిఎస్ ఆర్‌టిసి ఘనంగా సన్మానించింది.

అంతే కాదు, బస్ భవన్‌లో జరిగిన జెండా పండగకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిందని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఆ సందర్భంగా వారిని సమున్నతంగా సంస్థ సత్కరించిందని ఆయన తెలిపారు. చైత్రోత్సవాలను పురస్కరించుకొని సంస్థ ట్యాంక్ బండ్ పై చేపట్టిన ర్యాలీని కూడా నరసింహ నే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారని, ఆ సమయంలో తన అనుభవాలను నాతో పంచుకున్నారని సజ్జనార్ తెలిపారు. సంస్థ కొత్తగా ప్రవేశపెడుతున్న కార్యక్రమాలను ఎంతగానో ప్రశంసించారన్నారు. టిఎస్ ఆర్‌టిసిని ప్రజలకు మరింత చేరువ చేయడానికి సలహాలు కూడా ఇచ్చారన్నారు.

ప్రజా రవాణా వ్యవస్థకు ఎంతో సేవచేసిన ఆర్‌టిసి కురవృద్ధుడు నరసింహా మరణించడం బాధాకరం అన్నారు. నరసింహా కుటుంబ సభ్యులకు ప్రగాఢ నూతిని తెలియజేస్తున్నానన్నారు. కాగా, హైదరాబాద్ శివారు బొల్లారంలో టిఎల్ నరసింహా 1925లో జన్మించారు. 1944 నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్‌లో గుమస్తాగా ఉద్యోగంలో చేరారు. 1983లో ఆర్టిన్ ఎకౌంట్స్ ఆఫీసర్ గా పదవీ విరమణ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News