Monday, January 20, 2025

వాణిజ్య సముదాయాలు… పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటు !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసి స్థలాలు దుర్వినియోగం కాకుండా కమర్షియల్ కాంప్లెక్స్‌లతో పాటు పెట్రోల్‌బంక్‌లను ఏర్పాటు చేయాలని ఆర్టీసి నిర్ణయించింది. అందులో భాగంగా త్వరలోనే 50 పెట్రోల్ బంకులను ఆర్టీసి ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మూడు ప్రధాన చమురు కంపెనీలతో ఆర్టీసి ఒప్పందం చేసుకున్నట్టుగా తెలిసింది. హైదరాబాద్ పరిధితో పాటు మిగతా ప్రాంతాల్లో ఈ బంకులను ఆర్టీసి ఏర్పాటు చేయనుంది.

అయితే పలుచోట్ల ఆర్టీసి స్థలాలను కొందరు కబ్జాచేయడానికి ప్రయత్నిస్తుండడంతో వాటిని ఖాళీగా ఉంచకుండా ఆయా స్థలాల్లో వాణిజ్య సముదాయాలను నిర్మిస్తే ఆర్టీసికి అదనంగా ఆదాయం వస్తుందన్న భావనతో ఆర్టీసి ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొంది స్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభమయినట్టుగా సమాచారం. అయితే వాణిజ్య సముదాయాలతో పాటు పెట్రోల్‌బంక్‌లను ఏర్పాటు చేస్తే సంస్థకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్టీసి ఆలోచనగా తెలుస్తోంది. గతంలోనే ఈ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి భావించినా అనువైన ప్రాంతాలు లేకపోవడం, కోర్టు కేసులు, ఎన్‌ఓసిలు రాకపోవడంతో కేవలం 23 బంకులను మాత్రమే ఆర్టీసి ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం ఈ కొత్త బంకులు 6 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆర్టీసి అధికారులు పేర్కొంటున్నారు. ఆర్టీసికి సంబంధించిన మరిన్ని ఖాళీ స్థలాల్లో కల్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించి వాటిని లీజుకు ఇవ్వాలని ఆర్టీసి నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతోపాటు చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌బంక్‌లను ఆర్టీసి డిపోల పక్కనే ఏర్పాటు చేయాలని, మిగతా వాటిని సర్వీసు ప్రొవైడర్ల ద్వారా బంక్‌లను నిర్వహించాలని ఆర్టీసి నిర్ణయించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News