Thursday, January 23, 2025

అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆర్‌టిసి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోల్లో అప్రెంటిస్ పో స్టుల భర్తీకి టిఎస్ ఆర్‌టిసి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్ ట్రైనీ ఖా ళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. బిఏ, బికాం, బిబిఏ, బిసిఏ వంటి ఆనన్ ఇంజనీరింగ్ విభాగానికి చెంది న గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టుల్లో 150 ఖాళీగా ఉన్నాయని టిఎస్ ఆర్‌టిసి ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి -30 ఏళ్ల్ల మధ్య వయసు ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ మూ డేళ్లు ఉంటుంది. మొదటి సంవత్సరం నెలకు రూ.15వేలు, రెండో సంవత్సరం లో నెలకు రూ.16వేలు, మూడో సంవత్సరంలో నెలకు రూ.17వేలు స్టైఫండ్ ఉంటుందని ఆర్‌టిసి తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు http://tsrtc.telangana.gov.in సంప్రదించాలని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News