Saturday, November 9, 2024

ఆర్‌టిసి పండగా ఆదాయం పెంచేందుకు

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికారులు

Minister Puvvada review meet with officers on rtc charges hike

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఆరీసి అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండగ సందర్భంగా సంస్థకు భారీఆదాయాన్ని సమకూర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గత సంత్సరం దసరాపండగను పురస్కరించుకుని నడిపిన ప్రత్యేకబస్సుల్లో ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయలేదు. దాంతో మంచి ఫలితాలు రావడంతో అదే విధానాన్ని ఈ సంవత్సరం సంక్రాంతి పండగక సందర్భంగా అమలు చేస్తున్నారు. ప్రయాణికులను టిఎస్‌ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించే విధంగా వారు అవగాహన కల్పిస్తున్నారు.ఏపీతో పోల్చితో టిఎస్ ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు.అంతే కాకుండా శివారు ప్రాంత ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రవేట్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా వచ్చేస సమస్యలను ప్రయాణికులకు వివరిస్తూ ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించడం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తున్నారు. సంక్రాంత్రి పండగ సందర్భంగా తమ ప్రాంతాలకు బయలు దేరి వెళ్ళాలనుకునే ప్రయాణికులు ఉండే కాలనీలు, బస్తీలు ప్రాంతాల్లో ఉండే వారిని ఆకర్షించే కార్యక్రమంలో భాగంగా ఎటువంటి ఒక బృందంగా ఉన్న వారి కోసం స్పెషల్ బస్సులను ఇంటి వద్దకే పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి ఎటువంటి అడ్వాన్స్‌డ్ డిపాజిట్‌లు చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.అంతే కుండా బస్టేషన్ల సమీపంలో ప్రైవేట్ బస్సులు ఆపకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
బస్టేషన్లు, ప్రత్యేక కౌంటర్ల వద్ద సుమారు 200 అధికారులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి రవాణా సమస్యలు లేకుండా చేస్తున్నారు.బస్సులు ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులు ఎ బస్సు ఎక్కడ ఉంది.. ఎన్ని గంటలకు వస్తుంది అనే వివరాలను ఎంతో సహనంతో వివరిస్తూ వారు ప్రయాణించే బస్సులు మిస్‌కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఒక వైపు అధికారులు ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తూనే మరో వైపు ప్రయాణికులు నిలువు దోపిడికి గురి చేస్తున్నప్రవేట్‌ట్రావెల్స్‌పై కొరఢా ఝుళిపిస్తున్నారు.ఇందులో భాగంగా ఆర్‌టివో,ఆర్‌టిసి సంయుక్త ఆవరణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న బస్సులను ఎక్కడికక్కడే సీజ్ చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బయలు దేరే టిఎస్‌ఆర్టీసీ, ఎపిఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చార్జీల వివరాలు

ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ప్రాంతం టిఎస్ ఆర్‌టిసి ఏపిఎస్ ఆర్టీసీ
విజయవాడ 415.00 610.00
విశాఖపట్నం 960.00 1410.00
రాజమండ్రి 650.00 955.00
అమలాపురం 715.00 1050.00
రాజోలు 655.00 1000.00
నరసాపురం 620.00 950.00
నెల్లూరు 690.00 990.00
ఓంగోలు 510.00 755.00
కందుకూరు 565.00 865.00
కడప 630.00 930.00
కర్నూలు 330.00 485.00
కాకినాడ 750.00 1110.00

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News