Monday, January 20, 2025

అరుణాచల గిరి ప్రదర్శనకు టిఎస్ ఆర్టీసి ప్రత్యేక బస్సు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ ఆర్టీసి) శుభవార్త చెప్పింది. అరుణాచల గిరి ప్రదర్శనను ప్రయాణికులకు టూర్ ప్యాకేజీగా అందించాలని టిఎస్ ఆర్టీసి నిర్ణయించింది. అందులో భాగంగా గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3వ తేదీన అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని సంస్థ నిర్ణయించింది.

సర్వీసు నంబర్ 98889 గల ఈ బస్సు జూలై 2వ తేదీన ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబిఎస్ నుంచి బయలుదేరుతుందని ఆర్టీసి తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుడి దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జూలై 3వ తేదీ సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్, అక్కడ దర్శనానంతరం హైదరాబాద్‌కు మరుసటి రోజు జూలై 4వ తేదీ ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది.
ఈ ప్యాకేజీ ధర ఒక్కోక్కరికీ రూ.2600లు
ఈ ప్యాకేజీ ధర ఒక్కోక్కరికీ రూ.2600లుగా ఆర్టీసి సంస్థ నిర్ణయించింది. గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టిఎస్ ఆర్టీసి ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలని ఆర్టీసి సూచించింది. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.inలో ముందస్తు

రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంజిబిఎస్, జేబిఎస్, దిల్ సుఖ్‌నగర్ బస్టాండ్‌తో పాటు సమీప టిఎస్ ఆర్టీసి రిజర్వేషన్ కౌంటర్‌లోనూ బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959226257,9959224911 ఫోన్ నంబర్‌లలో సంప్రదించాలని టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండి విసి సజ్జనార్‌లు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News