30 మంది ప్రయాణికులు ఉంటే
ఈ ఇంటి వద్దకే బస్సు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నుంచి త్వరలో జరగున్న మేడారం జాతరకు ప్రత్కేక ఏర్పాట్లు చేస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. వి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా జాతరకు వెళ్ళాలనుకునే భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులన ఎటువంటి అదనపు డిపాజిట్ లేకుండా అందిస్తున్నామన్నారు. ప్రయాణికుల నివాస ప్రాంతం నుంచి మేడారం, సమ్మక్క, సారలమ్మ గద్దెల వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.ఈ ప్రత్యేక బస్సులు ఉదయం హైదరాబాద్‌లో ప్రయాణికుల ( బుక్ చేసుకున్న వారు) నివాసం ప్రాంతం నుంచి బయలు దేరి మేడారం చేరుకుని అమ్మవార్ల దర్శనం అనంతరం, తిరిగి అదే రోజు మేడారం నుంచి బయలు దేరి ప్రయాణికులను సురక్షితంగా వారి వాసప్రాంతాల్లో వదిలే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసుకోవాలనుకునే భక్తుల 30 మందితో కూడిన గ్రూపుగా ఏర్పడితే చాలనీ నగరంలో మీరుండే ప్రాంతాలకే బస్సులు పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలను సంస్థ www.tsrtconline.in ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.