24 నుంచి 4198 ప్రత్యేక బస్సులు
రద్దీ నివారణకు ప్రత్యేకే ఏర్పాట్లు చేశాం: ఆర్‌ఎం శ్రీధర్
హైదరాబాద్: దసరా పండగ వచ్చిదంటే ఇటు ఆర్టిసి అధికారులకు అటు ట్రాఫిక్ అధికారులకు చేతినిండా పనే. పండగ సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్‌లతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడతారు. కొన్ని సందర్భాల్లో విపరీతమైన ట్రాఫిక్ కారణంగా తాము ముందస్తు టికెట్లు రిజర్వు చేసుకున్నా సరయిన సమయానికి బస్టేషన్లకు గాని, వారి గమ్యస్థానాలకు చేరుకో లేక పోతున్న సందర్భాలు అనేక ఉన్నాయి. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్న ఆర్టిసి అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెలలో ప్రారంభం కానున్న దసర ఉత్సవాలను దృష్టికి ఉంచుకుని గ్రేటర్ హైదరబాద్ నుంచి తెలంగాణలోని జిల్లాలకే కాకుండా పోరుగున రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు 4198 బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఏ.శ్రీధర్ తెలిపారు. మంగళవారం మహాత్మాగాంధీ బస్టేషన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 24 నుంచే వచ్చే నెల 4వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
ఆయన తెలిపారు. ఎంజిబిఎస్, సిబీఎస్, జేబీఎస్, దిల్‌షుక్‌నగర్, లింగంపంల్లి,చందానగర్ ,కేపిహెచ్‌బి, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్,ఎల్‌బినగర్‌తో పాటు జంట నగరాల్లోని వివారు కాలనీల్లో నివసించే వారి సౌకర్యంకోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆధీకృత ఏజెంట్ల నుంచి కూడా ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. 24, 25 తేదీలలో 737 బస్సులను, అదే విధంగా ఈ నెల 30 నుంచి వచ్చేనెల 5 వరకు 3461 బస్సులను నడనప నున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 4వ తేదీలలో ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకుని 517 అదనపు బస్సులను అడ్వాన్స్ రిజర్వేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుని చివరి నిమిషంలో అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ట్రాఫిక్ నియంత్రణ ప్రత్యేక ఏర్పాట్లు: జంట నగరాల్లోని పలు ప్రాంతాలా నుంచి ఎంజిబిఎస్‌కు వచ్చే ప్రయాణికులకు ఎటవంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ఇందులో భాగంగా పలు రూట్ల నుంచి బస్సులను నడుపుతామన్నారు. జెబీఎస్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్,మెదక్, వైపు వెళ్ళే బస్సులను, అదే విధంగా ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి యాదగిరి గుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట,మహాబూబాబాద్,తోర్రురూర్,వరంగల్ వైపు, దిల్‌షుక్‌నగర్ నుంచి మిర్యాలగూడ,నల్గొండ,కోదాడ, సూర్యాపేట వేళ్ళే షెడ్యూల్ బస్సులతో పాటు స్పెషల్ బస్సులను సిబిఎస్ నుంచి కర్నూల్,తిరుపతి,మాచర్ల, ఓంగోలు, నెల్లూరు,అనంతపురం,గుత్తి ,పుట్టపర్తి,ధర్మవరం,మదనపల్లి వైపు వెళ్ళే షెడ్యూల్,స్పెషల్ బస్సులను నడపుతున్నట్లు తెలిపారు.