రంగారెడ్డి: శ్రీ రామానుజలవారి సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన 216 అడుగుల ఎత్తుగల రామానుజుల సమతామూర్తి విగ్రహం సందర్శించేందుకు వచ్చే భక్తల సౌకర్యకం కోసం గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు ఫిబ్రరి 2 నుంచి 14 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 6 , 7 గంటలకు బస్సులు పఠాన్ చెరు, లింగంపల్లి, గచ్చిబౌలీ, శంషాబాద్, పంజాగుట్ట, మెహదీపట్నం, ఆరాంఘర్, మేడ్చెల్, కొంపల్లి, బాలానగర్, మెహదీపట్నం, ఆరాంఘర్, అల్వాల్ జేబిఎస్, ఆర్‌టిసి ఎక్స్ రోడ్, అఫ్జల్‌గంజన్ , జూ పార్క్, ఆరాంఘర్, ఘట్కేసర్, ఉప్పల్, ఎల్‌బినగర్, మిధాని, ఈసీఐఎల్, తారానాక, ఫీవర్ ఆసుపత్రి, నారాయణగూడ, లక్డికాపూల్, మెహీపట్నం, హయత్‌నగర్, దిల్‌షుక్‌నగర్, ఎంజిబిఎస్, ప్రాంతాలతో పాటు కాచిగూడ రైల్వేస్టేషన్, నాంపల్లి రైల్వేస్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతాల నుంచి ముచ్చింతల్ క్యాంప్‌కు బస్సులను తిప్పుతామన్నారు. భక్తులకు కలిగించే ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.