- Advertisement -
హైదరాబాద్: నగరంలో సోమవారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల కోసం ఆర్‌టిసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరం నలుమూలల నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి 24 డిపోల నుంచి 60 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సులు సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ బస్సుల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇద్దరు డిపో మేనేజర్లు ఉప్పల్ (9959226140), చెంగిచర్ల (7893088433)లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. క్రికెట్ అభిమానుల కోసం కల్పించిన ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- Advertisement -