Thursday, December 26, 2024

సంక్రాంతి స్పెషల్.. ఇంటి వద్దకే బస్సులు

- Advertisement -
- Advertisement -

TSRTC Special buses for Sankranthi Festival

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి అధికారులు సంస్థ ఆదాయాన్ని పెంచడమే కాకుండా ప్రయాణికులు సౌకర్యాలపై కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగా సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకు వెళ్ళే విద్యార్థుల కోసమే కాకుండా సొంతూళ్ళకు కాలనీల నుంచి వెళ్ళాలనుకునే ప్రజలకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు చార్జీలను కూడా వసూలు చేయడం లేదన్నారు. ప్రత్యేక బస్సులు కావాలనేకునేవారు ఒక గ్రూపుగా ఏర్పడి బస్సులను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అంతే కాకుండా 18 మంది ప్రయాణికులున్నా వారికోసం మిని ఎయిర్ కండీషన్ బస్సులను కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ అవకాశం 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉంటుందన్నారు. పూర్తి వివరాలను సమీపంలోని డిపో కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరల కోసం సికింద్రాబాద్ సీటిఎం(9959226117), చార్మినార్ డివిఎం(9959226129), హయత్‌నగర్ డీవీఎం (9959226136), కాచిగూడ డీవీఎం(9959226087), సనత్‌నగర్ డీవీఎం(9959226148)లు సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

TSRTC Special buses for Sankranthi Festival

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News