Sunday, January 19, 2025

బస్సులో పోగొట్టుకున్న పర్స్‌ను ప్రయాణికునికి అందజేసిన సిబ్బంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు తన పర్స్ ను పోగొట్టుకోగా బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ పర్సును ప్రయాణికునికి అందజేయడంతో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. హైదరాబాద్ -2 డిపోకు చెందిన 2651 బస్సు హైదరాబాద్ నుంచి తొర్రూర్ వెళుతుండగా వల్లందాసు పవన్ కల్యాణ్ అనే యువకుడు చందుపట్లలో ఎక్కి మోత్కూరులో దిగిపోయారు. బస్సు దిగిన తర్వాత ప్యాంట్ జేబులో పర్స్ లేకపోవడంతో బస్సులో తన పర్సు పోయిందని ఆర్టీసీ మోత్కూరు బస్టాండ్‌లో కంట్రోలర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కంట్రోలర్ బస్సు డ్రైవర్, కండక్టర్ కు ఫోన్ చేసి చెప్పడంతో వారు బస్సులో వెతకగా పర్సు లభించింది. పర్సులో రూ.8500, ఏటీఎం కార్డుతో పాటు ఇతర గుర్తింపు కార్డులు ఉన్నాయి. ప్రయాణికునికి పర్సు అందజేయడంతో అతను డ్రైవర్, కండక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ అనంతుల శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2 డిపో డ్రైవర్ యాకాంబ్రం, కండక్టర్ పి.శోభ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News