Tuesday, January 21, 2025

రోడ్లు ఉన్నాయి కానీ బస్సు లేదు..కాలి నడకన ప్రజలు

- Advertisement -
- Advertisement -

కాసిపేటః దెయ్యం బూచితో సోనాపూర్ గ్రామానికి మంచిర్యాల నుండి వచ్చె ఆర్‌టిసి బస్సును నెలల తరబడిగా ఆపివేయడంతో ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలకు గురువుతున్నారు. కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప ప్రాంతం నుండి తాటిగూడ, ధర్మరావుపేట, మల్కేపల్లి, వెంకటాపూర్, కుర్రెగాడ్, లక్ష్మీపూర్, నాయకపుగూడ, జైతుగూడ, సోనాపూర్, ఆ ప్రక్కన సాలేగూడ, గట్రావ్‌పల్లి, తుడుంగూడ, బాదుగూడ, గ్రామాల గిరిజనులకు మంచిర్యాల సోనాపూర్ బస్సు సౌకర్యంగా ఉండేది. మారూమూల గ్రామాల గిరిజనులు మండల కేంద్రానికి రావాలన్న, నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు రావాలన్న రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కిలో మీటర్ల మేరకు నడిచే వెళ్తున్నారు.

స్వాతంత్రం సిద్దించిందని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు ఇంకా మారుమూల గ్రామాల ప్రజలు కాలి నడకన వెళ్తున్నప్పటికి స్పందించక పోవడం గమనార్హం. ఇప్పటికే మారు మాల గ్రామాలకు అందమైన తారు రోడ్లు కూడా ఉన్నాయి. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్న నానుడి మాటలు నిజం అవుతున్నాయి. గతంలో మంచిర్యాల నుండి సోనాపూర్ వరకు నడిచిన ఆర్‌టిసి బస్సును దెయ్యం పేరిట నిలిపి వేసారు. బస్సు కొరకు ఆదివాసీలు పలు మార్లు ఆర్‌టిసి అధికారులకు, పాలకులకు మొర పెట్టుకున్నారు. నెలలు గడుస్తున్న పల్లెలకు మాత్రం ఆర్‌టిసి బస్సు రావడం లేదు. గత దసరా సమయంలో వేస్తామని ఆర్‌టిసి అధికారులు హామి ఇచ్చిన ఈ దసరా కూడా దాటి పోయింది బస్సు మాత్రం రాలేదు. ఇప్పటికైన ఆర్‌టిసి అధికారులు స్పందించి సోనాపూర్‌కు బస్సు నడిపించాలని గిరిజనులు కోరుచున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News