Friday, November 22, 2024

తీరిన ఆర్‌టిసి ప్రయాణికుల కష్టాలు

- Advertisement -
- Advertisement -

TSRTC to increase bus services in Hyderabad

హైదరాబాద్: కొద్ది రోజుల వరకు శివారు ప్రాంతాల నుంచి సిటీకి రావాలన్నా అదే విధంగా సిటీ నుంచి శివారు ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఆయా ప్రాంతాలకు చెందినవారు అనేక ఇబ్బందులు పడేవారు. సమయానికి బస్సులు లేక పోవడం, ఉన్నా అరకొర బస్సులతో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. చేసేది ఏమీ లేక వారు ప్రైవేట్ రవాణా వ్యవస్థ అయినే ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించడంతో వారు ఇదే అవకాశంగా ప్రయాణికులను నిలువు దోపిడీ చేసేవారు.

శివారు ప్రాంతాలకు ప్రాధాన్యం

ప్రస్తుతం పెంచిన బస్సులను శివారుప్రాంతాలు దృష్టిలో పెట్టుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సాధారణ రూట్లులో తిరుగుతున్నా ఒకటి రెండు రోజుల్లో ఈ బస్సులను శివారు ప్రాంతాలకు కేటాయించనున్నారు. ఇప్పటికే అధికారులు ఏ రూట్లలో ఎన్ని బస్సులు నడవాలి, ఎన్ని ట్రిప్పులను తిప్పాలని అంశాలపై డిపో అధికారులుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుతున్నారు. ముఖ్యంగా రాజేంద్రనగర్, శివరాంపల్లి, ఆరంఘర్ చౌరస్తా , హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాలకు శివారు ప్రాంతాల్లో ఉన్న డిపోలనుంచి బస్సులు నగర నడిబోడ్డు మీదుగా తిప్పేందుకు అధికారులు ఆయా డిపోల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గతంలో మాదిరిగా కాకుండా ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదాయం వచ్చే మార్గాల్లో బస్సులను తిప్పనున్నారు. దీనిద్వారా ప్రయాణికులు అవసరాలు తీరడమే కాకుండా మరో వైపు సంస్థ ఆదాయం కూడా పెరిగే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు.

సరైన సమయంలో సరైన నిర్ణయం

ఒక వైపు పెట్రోల్ ధరలు సుమారు రూ.100కు చేరువలో ఉన్న సమయంలో అధికారులు బస్సుల సంఖ్యను పెంచడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతి రోజు ఉప్పల్ నుంచి కొండాపూర్‌లో తమ కార్యాలయానికి చేరుకోవాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తమ వాహనాలు అతి తక్కువ మైలేజ్ ఇస్తుండటంతో చేసింది ఏమీ లేక పెట్రోల్ ధరలు రోజుకు రోజుకు పెరుగుతున్నా భారం రోజులు నెట్టుకు వస్తున్నామని అయితే బస్సులు సంఖ్య పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రయాణకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తిప్పాలని వారు అధికారులను కోరుతున్నారు.

బస్సుల సంఖ్య పెంచేందుకు గ్రీన్ సిగ్నల్

ఇటు అధికారులు, అటు ప్రయాణికులు నుంచి వస్తున్న విజ్ఞప్తులు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంతో సిటీలో ప్రస్తుతం తిరుగుతున్న బస్సుల సంఖ్యను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటిలో దశలో సుమారు 25 శాతం అంటే సుమారు 734 బస్సులను అదే విధంగా రెండో దశలో 1450 బస్సులను పెంచిన అధికారులు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మరో 25 శాతం అంటే మొత్తం 75 శాతం బస్సులను అధికారులు నడపుతున్నారు. దీంతో సుమారు 2000 బస్సులు రోడ్డు ఎక్కినట్లు అయ్యింది. నడిబొడ్డు నుంచి శివారు ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులను తిప్పేందుకు అవకాశం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News