Sunday, December 22, 2024

ఆర్టీసీ కార్మికుల జంగ్ సైరన్

- Advertisement -
- Advertisement -

నేడు రెండు గంటల పాటు బస్సులు నిలిపివేత
బిజెపి వైఖరిపై మండిపడుతున్న సంఘాల నాయకులు

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లుకు గవర్నర్ నిర్లక్షం ప్రదర్శించడంపై ఆర్టీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా జంగ్ సైరన్‌కు పిలుపునిచ్చాయి. శనివారం రెండు గంటల పాటు బస్సుల నిలిపివేయాలని కార్మికులకు సంఘాల నాయకులు సూచించారు. రాష్ట్ర బిజెపి వైఖరి మండిపడుతున్న కార్మికులు రాజ్‌భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అదే విధంగా ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలు చేసేందుకు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నాయకులు కోరారు. ఆర్టీసీ విలీనానికి అడ్డుపడితే సహించేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News