Sunday, February 23, 2025

ఎసిబి వలలో లైన్‌మెన్, లైన్ ఇన్స్‌స్పెక్టర్

- Advertisement -
- Advertisement -
TSSPDCL line inspector lineman in ACB net
లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసిబి అధికారులు

హైదరాబాద్: మీటర్ బిగించేందుకు లంచం తీసుకుంటు విద్యుత్ అధికారులు ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ మాదాపూర్ సర్కిల్‌లో లైన్ ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌రావు, లైన్‌మెన్‌గా పనిచేస్తున్న సతీష్‌ను ఎసిబి అధికారులు రూ.10,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మాదాపూర్‌కు చెందిన మలావత్ లక్ష్మణ్ తన కూతురు ఇంట్లో మీటర్ బిగించాలని విద్యుత్ అధికారులను కోరాడు. దానికి వారు రూ.10,000 లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే మీటర్‌ను బిగిస్తామని చెప్పారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు విద్యుత్ అధికారులకు డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన ఎసిబి అధికారులు ఎసిబి జడ్జి ఎదుట హాజరు పర్చారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News